వైకాపా నేతల మోసం వల్లే ఓటమి: చింతపల్లి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: శివ స్థలం: రామచంద్రాపురం

రామచంద్రాపురం మున్సిపల్ ఎన్నికల ఓటమిపై వైకాపా ఛైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన తనయుడు సూర్యప్రకాశ్ తనను నమ్కించి దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు కోరినా ప్రచారానికి రాలేదని విమర్శించారు. భవిష్యత్తులో వారిని నమ్మి ఎవరూ ఎన్నికల్ లో పోటీ చేయవద్దని పిలుపునిచ్చారు. ఈ వీడియో వ్యాఖ్యలు స్థానికంగా రాజకీయ దుమారం రేపాయి.