మూణ్నాలుగు నెలల్లో పిఠాపురంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తానని పవన్ కల్యాణ్ వెల్లడి
రిపోర్టర్: మహేష్
స్థలం: కాకినాడ
పిఠాపురంలో జనసేన పార్టీ కమిటీ తీరు సరిగ్గా లేదని, మూణ్నాలుగు నెలల్లో తాను ఇక్కడే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి నాయకులకు దిశానిర్దేశం చేస్తానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉప్పాడ తీర రక్షణకు రూ.323 కోట్లు మంజూరు చేసిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.