కావలిలో భక్తులకు ఉచితంగా వినాయక ప్రతిమల పంపిణీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

కావలి పట్టణంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉచితంగా వినాయక ప్రతిమలను పంపిణీ చేయనున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఈ నెల 13న ఎంపీ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.