బిష్కెక్ వేదికగా ముగిసిన ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు

రిపోర్టర్: సురేష్ స్థలం: World

కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ వేదికగా జరిగిన 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారంపై సభ్య దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా ఖండించాలని, సరిహద్దుల గుండా ఉగ్రవాదుల కదలికలను అడ్డుకోవాలని సదస్సులో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సదస్సు ముగింపులో ఎస్సీఓ అధ్యక్ష బాధ్యతలను పాకిస్థాన్‌కు అప్పగించారు. ప్రపంచ దేశాల మధ్య శాంతి, సుస్థిర అభివృద్ధి కోసం సభ్య దేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి.