టీచర్లపై దాడులు చేస్తే రౌడీల తోక కత్తిరిస్తామన్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: విజయ్
స్థలం: కుప్పం
కుప్పం పర్యటనలో భాగంగా స్వర్ణ కుప్పం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, విజయవాడలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైఎస్సార్సీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదోస్తే చూస్తూ ఊరుకోమని, రౌడీలు మరియు విధ్వంసకారుల తోక కత్తిరిస్తామని హెచ్చరించారు. గతంలో 14 సార్లు డీఎస్సీ నిర్వహించామని, టీడీపీ హయాంలో మెగా డీఎస్సీలో అవినీతికి తావులేదని స్పష్టం చేస్తూ, కుప్పం ప్రజలతో తనది రాజకీయ జన్మభూమి బంధమని కొనియాడారు.