విద్యార్థులకు తీపి కబురు: తెలంగాణలో రెండు వందల కోట్ల స్కాలర్షిప్ నిధులు విడుదల
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలోని ఉన్నత చదువులు అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందిస్తూ రూ. 204.40 కోట్ల భారీ పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ముప్పై రెండు వేలకు పైగా అర్హులైన విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, కాలేజీ ఫీజుల చెల్లింపులు ఎలాంటి అవరోధాలు లేకుండా సజావుగా సాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.