పాకిస్థాన్ ఆరోపణలను తిరస్కరించిన విదేశాంగ శాఖ
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌకను పాకిస్థాన్ నౌక ఢీకొన్న ఘటనపై ఇస్లామాబాద్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. పాక్ ఎప్పుడూ వంకర మాటలే మాట్లాడుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఉత్తర అరేబియా సముద్రంలో గస్తీలో ఉన్న ఐఎన్ఎస్ కోల్‌కతా వద్దకు పాక్ నౌక పీఎన్ఎస్ హునైన్ ప్రమాదకర రీతిలో దూసుకురావడం వల్లే ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.