కిడ్నీ బాధితులకు భారీ ఊరట: రాష్ట్రంలో మరో ఇరవై రెండు డయాలసిస్ కేంద్రాలు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
కిడ్నీ బాధితులకు వైద్యసేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద కొత్తగా ఇరవై రెండు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన చేస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలు సేవలందిస్తున్నాయని, కొత్తగా ఏర్పాటు చేసే ప్రతి కేంద్రంలో ఐదు యంత్రాలు అందుబాటులోకి వస్తాయని, వీటి ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన స్పష్టం చేశారు.