ఆర్యడన్ ముహమ్మద్ ఉత్తమ ప్రజాసేవక పురస్కారం స్వీకరించిన రేవంత్ రెడ్డి
రిపోర్టర్: సునీల్
స్థలం: సిద్దిపేట
కేరళలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యడన్ ముహమ్మద్ 2026 ఉత్తమ ప్రజాసేవక పురస్కారాన్ని అందుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఈ విషయాన్ని సామాజిక మాధ్య వేదికగా ప్రజలతో పంచుకున్నారు. ఈ పురస్కారాన్ని తనకు అందించిన ఆర్యడన్ ముహమ్మద్ ఫౌండేషన్ నిర్వాహకులకు, అందజేసిన కేసీ వేణుగోపాల్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని ఎంతో విన్రతో స్వీకరిస్తున్నానని పేర్కొంటూ, ఈ అవార్డును రాష్ట్ర ప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.