విజయనగరం జేఎన్టీయూ జీవీలో మార్కుల అక్రమాల కలకలం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విజయనగరం జేఎన్టీయూ జీవీ విశ్వవిద్యాలయంలో మూల్యాంకనంలో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. డబ్బులు తీసుకుని సున్నా మార్కులు వచ్చిన విద్యార్థికి 40 మార్కులు వేశారు. మరో విద్యార్థికి 21 వస్తే 26గా మార్చేశారు. ఈ అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విచారణ జరిపి, వీవీ సుబ్బారావు ఆదేశాల మేరకు వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.