విద్యార్థులకు అలర్ట్: విడుదలైన బీహార్ బోర్డు డమ్మీ అడ్మిట్ కార్డ్
రిపోర్టర్: నరేష్
స్థలం: పాట్నా
పది మరియు పన్నెండో తరగతి బోర్డు పరీక్షల విద్యార్థుల కోసం బీహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు డమ్మీ అడ్మిట్ కార్డులను విడుదల చేసిందని అధికారులు తెలిపారు. అధికారిక వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. నవంబర్ ఏడవ తేదీ వరకు తప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. వివరాల్ లో పొరపాట్లు ఉంటే పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.