తుఫాన్ బాధితులకు పూర్తి అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన ఆయన, సహాయక చర్యలు మరియు పునరుద్ధరణ పనులకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు నష్టాన్ని అంచనా వేయడానికి త్వరలో ప్రత్యేక కేంద్ర బృందాలను పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.