ఆసిఫాబాద్ చిల్డ్రన్స్ పార్క్ పై అబ్దుల్లా ఆకస్మిక దాడి

రిపోర్టర్: SHAIK ARIF స్థలం: ఆసిఫాబాద్

మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డు లో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా మార్నింగ్ వాకర్స్ అభ్యంతరాల మేరకు సందర్శించారు. పార్క్ నిర్వహణ, వాష్రూమ్ల శుభ్రత, పిల్లల ఆట వస్తువుల స్థితిగతులను పరిశీలించారు. చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఆట వస్తువులకు మరమ్మతులు చేయించి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.