నెల్లూరులో జోరుగా గ్యాస్ అక్రమ రవాణా: నల్లబజారుకు సబ్సిడీ సిలిండర్లు
రిపోర్టర్: నరేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు నల్లబజారుకు తరలిపోతున్నాయని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో సిలిండర్ను రూ.1600 నుంచి రూ.1800 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఎనిమిది లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాణిజ్య కనెక్షన్లు మాత్రం కేవలం రెండు వేలకు పైగా మాత్రమే ఉన్నాయి. పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి.