ఏపీకే ఫైళ్ల ద్వారా భారీ మోసాలు గుజరాత్‌లో ముగ్గురు అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: Ahmedabad

ఏపీకే ఫైళ్ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్ డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు భగ్నం చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మహ్మద్ ఇస్మాయిల్ అన్సారీ, షేక్ మహ్మద్ నూరెన్‌లతో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రజలు అపరిచిత ఏపీకే ఫైళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.