టైటాన్ సబ్మెరైన్ ప్రమాద రహస్యం బట్టబయలు: ఐఐటీ ధన్బాద్ పరిశోధనలో సంచలనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ధన్‌బాద్

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన టైటాన్ సబ్మెరైన్ ప్రమాదానికి గల ప్రధాన కారణాలను ఐఐటీ- ఐఎస్ఎం ధన్బాద్ పరిశోధకులు కనుగొన్నట్లు నిపుణులు తెలిపారు. సముద్రం లోపల విపరీతమైన పీడనం కారణంగా కార్బన్ ఫైబర్ పొరలు విడిపోవడం, అడ్హెసివ్ వైఫల్యం చెందడం వల్లనే జలాంతర్గామి పేలిపోయిందని వారు స్పష్టం చేశారు. ఈ నమూనాల విశ్లేషణ భవిష్యత్తులో సబ్మెరైన్ల రూపకల్పన, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతో దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.