అనంతపురం జిల్లా ఆర్టీఐ కార్యకర్త గోపాల్‌పై రాష్ట్ర సమాచార కమిషన్ నిషేధం
రిపోర్టర్: సునీల్
స్థలం: అనంతపురం
సమాచార హక్కు చట్టం పేరుతో అధికారులను వేధిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త బి.గోపాల్‌పై ఏపీ రాష్ట్ర సమాచార కమిషన్ నిషేధం విధించింది. డబ్బులు తీసుకుని దరఖాస్తులు దాఖలు చేస్తున్నట్లు తేలడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.