గ్రామాన్ని కాపాడుకునేందుకు పోరుబాట పట్టిన ఆకుతోటపల్లి ప్రజానీకం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం ఆకుతోటపల్లిలో క్రషర్ ఏర్పాటును నిరసిస్తూ గ్రామస్తులు పోరుబాటకు సిద్ధమయ్యారు. రేపు ఆమనగల్లు భవాని గార్డెన్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం తహసిల్దార్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపడుతున్నట్లు ఆకుతోటపల్లి గ్రామ సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి మరియు గ్రామ పాలకవర్గం సభ్యులు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.