పాఠశాల లేక నిత్యం నరకం చూస్తున్న గిరిజన విద్యార్థులు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పెదబయలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ సంపంగిదాట్టు గ్రామంలో పాఠశాల సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి రాసగుప్ప ప్రాథమిక పాఠశాలకు సుమారు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది. వర్షం పడుతున్నా విద్యార్థులు, వాలంటీర్ ఇబ్బందులను ఎదుర్కొంటూ బడికి వెళ్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపంగిదాట్టులో వెంటనే పాఠశాలను ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు.