ఆశా వర్కర్ల ఆందోళన బాట: ఈ నెల 15 నుండి నిరవధిక సమ్మె

రిపోర్టర్: నరేష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కోశాధికారి పద్మ వెల్లడించారు. బూర్గంపహాడ్ మెడికల్ ఆఫీసర్ కు ఆశా కార్యకర్తలతో కలిసి సమ్మె నోటీసులు అందజేసినట్లు ఆమె స్పష్టం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా ప్రభుత్వం శ్రమను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.