బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదుంటూ మంత్రి ఉత్తమ్ మండిపాటు
రిపోర్టర్: శివ
స్థలం: సూర్యాపేట
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1.06 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 3.42 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పర్యటనలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు, రూ. 8.90 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు.