నర్సంపేట: టాబ్లెట్లు మింగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

బుధరావుపేట మోడల్ పాఠశాల, కళాశాల వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నర్సంపేటకు చెందిన విద్యార్థిని టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థుల ఎగతాళితో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అస్వస్థతకు గురైన ఆమె విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో వార్డెన్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.