జగిత్యాలలో పోలీస్ అమరవీరుల స్మారకార్థం ఘనంగా మెగా రక్తదాన శిబిరం
రిపోర్టర్: సురేష్
స్థలం: జగిత్యాల
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు SP JAGTIAL వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ సర్కిళ్ల సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో పాటు యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారని ఆయన తెలిపారు. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, సమాజ సంక్షేమం కోసం పోలీసులు ఎప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.