'బ్యాంకు లింకేజీ రుణాలకూ డిజిటల్‌ రీపేమెంట్‌ వర్తింపజేయాలి': మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

స్త్రీనిధి కింద డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల డిజిటల్‌ రీపేమెంట్‌ విధానాన్ని బ్యాంకు లింకేజీ రుణాలకూ వర్తింపజేయాలని బ్యాంకర్లను సెర్ప్‌శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. అమరావతి సచివాలయంలో బుధవారం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల రుణాల రికార్డ్‌ అద్భుతంగా ఉన్నందున వడ్డీ రేట్లను తగ్గించాలని, రుణం రెన్యువల్‌కు సంఘం సభ్యులందరూ రాకుండా లీడర్ల సంతకాలతోనే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.