ఆసియా క్రీడల్లో ఉజ్బెకిస్తాన్పై భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం

రిపోర్టర్: విజయ్ స్థలం: India

ఆసియా క్రీడల ప్రారంభ పూల్ బి మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 19-0 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఆటలో దీపిక అద్భుతంగా ఆడి ఎనిమిది గోల్స్ సాధించగా, లాల్‌రెమ్సియామి, ఇషికా, బల్జీత్ కౌర్, నేహా, నవ్‌నీత్ కౌర్, లాల్‌థంత్లాంగి, సాక్షి రాణా తదితరులు గోల్స్ చేశారు. ఈ విజయంతో భారత గోల్కీపర్ సవితా పునియా తన 320వ అంతర్జాతీయ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నారు.