గురువాయూరప్పను దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
రిపోర్టర్: రమేష్
స్థలం: కేరళ
కేరళ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గురువాయూర్ శ్రీ బాలకృష్ణుడిని దర్శించుకున్నారు. శనివారం వేకువజామున ఆలయానికి చేరుకున్న ఆయన, అత్యంత పవిత్రంగా భావించే నిర్మాల్య దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు.