తెలంగాణ విద్యా కమిషన్ లో వివాదం: గడువు ముగిసినా కొనసాగుతున్న మాజీ సభ్యులు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ నెలలోనే ముగిసినా, కొందరు మాజీలు అవే అధికారిక హోదాలను కొనసాగిస్తూ వివాదానికి కేంద్రం అయ్యారని విద్యారంగ నిపుణులు తీవ్రంగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చైర్పర్సన్ కాలపరిమితితోనే సభ్యుల గడువు కూడా ముగిసినప్పటికీ, కార్లపై హోడా బోర్డులు తగిలించుకుని తిరుగుతూ, ప్రభుత్వ కార్యాలయాలను వాడుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.