హైవేపై ఘోర ప్రమాదం: చెరువులో కారు బోల్తా పడి యువకుడు దుర్మరణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గంట్యాడ పెద్దచెరువు వద్ద కారు అదుపుతప్పి నీటిలో దూసుకెళ్లిన ఘటనలో వాహన చోదకుడు రమాకాంత్ మృతి చెందాడు. విజయనగరం నుండి వ్యాపారం ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఇరుక్కుపోయి ఊపిరాడక ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు గంట్యాడ ఏఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. గురువారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన గ్రామస్థులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.