తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరులకు ఘన నివాళి

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం: ఏనుకూరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా తాటి సత్యం, సీతమ్మ గార్ల స్తూపాలకు సీపీఐ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పుష్పగుచ్ఛాలు ఉంచి వారి త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతు రావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, యర్రా బాబు, ఏనుగు వెంకటేశ్వర్లు, రంజిత్ జాగర్లమూడి తదితరులు పాల్గొన్నారు.