తండ్రి తుపాకితో ఏషియన్ గేమ్స్ లో స్వర్తం సాధించిన కైనన్

రిపోర్టర్: సునీల్ స్థలం: Aichi-Nagoya

ఆసియా క్రీడల్లో తండ్రి డారియస్ చెనాయ్ కి చెందిన ముప్పై ఏళ్ల నాటి పాత తుపాకి బ్యారెల్ తో బరిలోకి దిగి మిక్స్డ్ ట్రాప్ విభాగంలో స్వర్ణ పతకం సాధించినట్లు షూటర్ కైనన్ చెనాయ్ వెల్లడించారు. జపాన్ లోని ఐచి నగరం వేదికగా జరిగిన ఈ పోటీలో నీరు ధాండాతో కలిసి ఆయన ఈ అరుదైన విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తన కంట కన్నీరు తిరిగినట్లు ఆయన భావోద్వేగంతో తెలిపారు.