విజయనగరం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

విజయనగరం పట్టణం 4వ డివిజన్ మంగలవీధికి చెందిన టీడీపీ కార్యకర్త షణ్ముఖేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లిన నేతలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.