సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీదేవి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే అమ్మరాజుల శ్రీదేవి డిమాండ్ చేశారు. కార్మికుల ఆరు ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 30న సీసీసీ కార్నర్లో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. 2025–26 లాభాల్లో 40 శాతం వాటా ఇవ్వాలని, సొంత ఇంటి స్థలాలు, భద్రతా పరికరాలు కేటాయించాలని కోరారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడతామని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.