పాకిస్థాన్ ఉగ్రవాద విధానంపై ఐక్యరాజ్యసమితిలో ఎస్ జైశంకర్ నిప్పులు
రిపోర్టర్: విజయ్
స్థలం: New York
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అవాస్తవాలు మాట్లాడారని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని సమర్థించే దేశాలను ఎప్పటకీ ఉపేక్షించబోమని, స్నేహం, సద్భావన ఉగ్రవాదంతో కలిసిపోవని ఆయన హెచ్చరించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.