పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగియనున్న గడువు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగియనుందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.