భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టాలన్న సర్పంచ్ నరేందర్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
నీటిని పొదుపు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆకుతోటపల్లి సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి తెలిపారు. కుళాయి లీకేజీలను అరికట్టి అవసరమైనంత నీటిని మాత్రమే వినియోగించాలని ఆయన కోరారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, భూగర్భ జలాలను పెంపొందించాలని సూచించారు. నేటి తరం నీటిని పొదుపు చేస్తేనే రాబోయే తరాలకు నీటి భద్రత కల్పించగలమని స్పష్టం చేశారు.