కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం
రిపోర్టర్: రాము
స్థలం: కోనసీమ, పార్వతీపురం మన్యం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం లక్కవరంలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటికి చేరుకునే రెండు నిమిషాల ముందు కారు చెట్టును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మరో ఘటనలో పార్వతీపురం మన్యం జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరణించారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.