పురుషోత్తపురంలో ఏరులై పారుతున్న మద్యంపై భగ్గుమన్న స్థానికులు
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో పోలింగ్ ప్రచారం ముగిసినప్పటికీ అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోంది. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అక్రమ మద్యపానాన్ని వెంటనే అరికట్టి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.