వీపీఆర్‌పై విమర్శలు చేసే నైతిక అర్హత మీకు లేదు!
రిపోర్టర్: కృష్ణ
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో జనసేన నాయకుడు గుడి హరికుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మాజీ మంత్రులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీపీఆర్ దంపతులపై అనవసర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, సొంత నిధులతో ప్రజాసేవ చేస్తున్న వారిని విమర్శించే నైతిక అర్హత వారికి లేదని ఘాటుగా విమర్శించారు.