కోరుకొండ సంతలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ సంతలో అన్నవరం పోలీస్ స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్లకు వచ్చే నకిలీ కాల్స్, ఓటీపీల మోసాల పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పి మోసపోవద్దని, బ్యాంక్ వివరాలు ఎవరికీ తెలపవద్దని స్థానికులకు అధికారులు స్పష్టంగా వివరించారు.