జ్ఞానంతో పాటు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలన్న జస్టిస్ కృష్ణమోహన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

విద్యాసంస్థలు కేవలం పట్టాలు అందించే కేంద్రాలు మాత్రమే కావని, జ్ఞానానికి, శక్తికి మూలస్తంభాలైన విజ్ఞాన దేవాలయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 6వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు నిజాయతీ, క్రమశిక్షణతో కూడిన విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనమే అత్యున్నతమైనదని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు.