అదృష్ట మహిళగా జోన్ గింథర్: నాలుగు సార్లు భారీ లాటరీ గెలుపు

రిపోర్టర్: రాము స్థలం: Texas

అమెరికాకు చెందిన మాజీ గణిత శాస్త్ర ప్రొఫెసర్ జోన్ గింథర్ పదిహేడేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు భారీ లాటరీ జాక్పాట్లను గెలుచుకున్నట్లు ఏబీసీ న్యూస్ తెలిపింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గణితంలో డాక్టరేట్ పొందిన ఆమె, 1993 నుంచి 2010 మధ్య కాలంలో మొత్తం ఇరవై మిలియన్ డాలకు పైగా సొమ్మును సొంతం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అసాధారణ విజయాల వెనుక గణిత విశ్లేషణ ఏమైనా ఉందా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.