ఫ్లోరిడా విమాన ప్రమాదం: ప్రాణాలు కోల్పోయే ముందు ప్రార్థన చేసిన పైలట్

రిపోర్టర్: సునీల్ స్థలం: ఫ్లోరిడా

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను దర్యాప్తు అధికారులు వెల్లడించారు. గ్రీన్ ఎకర్స్ సమీపంలో విమానం కుప్పకూలే కొన్ని క్షణాల ముందు లీర్ జెట్ పైలట్ కెప్టెన్ జెఫ్ గ్రెగొరీ లార్డ్స్ ప్రేయర్ చదివినట్లు చివరి కాక్ పిట్ ఆడియో ద్వారా స్పష్టమైందని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో కో పైలట్ నాథాలియా గడేల్హా ఫిల్గీరాస్ భయంతో కేకలు వేశారని అధికారులు పేర్కొన్నారు.