మునుగోడు అభివృద్ధిపై సొంత ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు

రిపోర్టర్: మహేష్ స్థలం: మునుగోడు

అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రావడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని మండిపడ్డారు. ప్రజల కోసం పనులు చేయలేకపోతే పదవి ఉన్నా దండుగని, నీటి పారుదల శాఖ మంత్రి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.