తెలంగాణ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహణ.. కాళోజీ సేవలను స్మరించుకున్న ఆమనగల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ఆచార్య శ్రీపాద శార్వాణి అధ్యక్షతన తెలుగు విభాగం ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రజా కవి కాళోజీ సేవలు చిరస్మరణీయమని, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారని ప్రిన్సిపాల్ కొనియాడారు. కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.