కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయవాడ

మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 7న విజయవాడలో జరగనున్న మీడియా సమావేశంలో పార్టీ విధివిధానాలు, అజెండాను వెల్లడించనున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజాపక్షంగా నిలబడి అసెంబ్లీ, పార్లమెంట్ వేదికలపై ప్రజల గొంతును బలంగా వినిపిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా మారింది.