ముంబై మురికివాడ నుంచి ఐఐటీ ఢిల్లీకి అభిషేక్ ప్రయాణం!

రిపోర్టర్: కృష్ణ స్థలం: Maharashtra

ముంబైలోని మురికివాడలో ఉంటూ, తండ్రి దినసరి కూలీగా పనిచేస్తున్నా అభిషేక్ శర్మ పట్టుదల వీడలేదు. చదువుకోవడానికి సరైన వసతులు లేకపోయినా, పక్కవారి వైఫై వాడుకుంటూ కష్టపడి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 2456వ ర్యాంక్ సాధించాడు. ఎలాంటి ఇబ్బందులనైనా పట్టుదలతో ఎదుర్కొని ఐఐటీ ఢిల్లీలో బీటెక్ సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.