కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజుల్లో మాత్రమే ఎన్నికల సంఘాన్ని నమ్మే రాహుల్ గాంధీ, మిగతా రోజుల్లో దానిని ఒక కుట్రగా అభివర్ణిస్తున్నారని కేంద్రమంత్రి G Kishan Reddy విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన, ఎన్నికల వ్యవస్థను అస్థిరపరిచేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆయన పేర్కొంటూ ప్రజల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.