వైడ్ బాల్ కాస్త సిక్స్ అయింది: క్రికెట్ చరిత్రలోనే విచిత్ర ఘటన

రిపోర్టర్: హరి స్థలం: కనడా

కెనడా వేదికగా జరుగుతున్న సూపర్ 60 టోర్నీలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుందని నిర్వాహకులు తెలిపారు. టొరంటో సిక్సర్స్, మిస్సిస్సాగా మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అమెరికా పేస్ బౌలర్ అలీ ఖాన్ వేసిన వైడ్ బాల్ కీపర్ అందకుండా నేరుగా బౌండరీ దాటి సిక్స్గా మారింది. ఫుట్బాల్ స్టేడియం కావడంతో వెనుక బౌండరీ దూరం తక్కువగా ఉండటంతో ఈ విచిత్ర సీన్ జరిగిందని, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోందని పేర్కొన్నారు.