జగన్ డిగ్రీ సర్టిఫికెట్ చూపించే దమ్ముందా?: తెదేపా ఎమ్మెల్సీలు
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
మెగా డీఎస్సీపై వైకాపా అధినేత జగన్ పదేపదే అసత్య ఆరోపణలు చేస్తూ నిరుద్యోగులను క్షోభకు గురిచేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీలు రాంగోపాల్రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుడ్ని అవమానిస్తూ సాక్షి ప్రతినిధులు బెదిరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే జగన్ ఇంటికి వెళ్లి ఆయన డిగ్రీ సర్టిఫికెట్ చూపించాలని అడగాలని సవాలు విసిరారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.