నాగావళి వరదలకు నీటమునిగిన వేలాది ఎకరాల వరి పంట
రిపోర్టర్: సునీల్
స్థలం: সంతకవిటి
నాగావళి నదికి వచ్చిన వరదలకు సంతకవిటి మండలం హొంజరాంతో పాటు పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. పెట్టుబడి పెట్టి కష్టపడి సాగుచేసిన పంట కళ్లముందే పాడైపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం అందించి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఏవో యశ్వంత్‌కుమార్ స్పష్టం చేశారు.